అతుకులని జల్లించండి. తరువాత నీళ్లతో తడిపి జల్లెడలో వదిలేయండి.
నూనె వేడి చేసి అందులో వేరుశెనగ గుండ్లు వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న వేరుశెనగ గుండ్లలో ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడనివ్వాలి.
మెత్తబడ్డ ఉల్లిపాయలో కేరట్ కాప్సికం ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
మగ్గిన కేరట్ కాప్సికంలో బటాణీ, మొలకలు, టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు మగ్గించండి.
తరువాత అటుకులు వేసి చిదిరిపోకుండా బాగా టాస్ చేయాలి. ఆ తరువాత కాస్త పంచదార వేసి కలిపి మూకుడు అంచుల వెంట నీళ్లు పోసి కదపకుండా మూత పెట్టి 3-4 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే అటుకు సరిగా లోపలిదాకా మగ్గుతుంది.
3-4 నిమిషాల తరువాత మూత తీసి నిమ్మరసం కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.