అడుగు మందంగా ఉన్న మూకుడులో పాలు పోసి అడుగునుండి కలుపుతూ పాలని ఓ పొంగు రానివ్వండి. పొంగోచ్చక దింపెసుకోండి.
ఇప్పుడు వెనిగర్, నీళ్ళు ఓ గిన్నె లో పోసి కలిపి వేడి వేడి పాలల్లో కొద్దికొద్దిగా పోస్తూ పాలు విరిగి ముద్దగా అయి నీళ్ళు వేరు పడే దాకా కలుపుతూ ఉండండి.
వెనిగర్ వేసాక సరిగ్గా పనీర్ రావడానికి 2 నిమిషాల టైం పడుతుంది
ఇప్పుడు జల్లెడలో ఓ వైట్ కాటన్ క్లాత్ వేసి అందులో ఈ పనీర్ని పోసి వడకట్టి నీళ్ళని గట్టిగా పిండేయండి.
ఇప్పుడు పనీర్ ముద్దని క్లాత్ మీద చతురస్రాకారం లోకి సర్దుకుని క్లాత్తో కప్పి దాని మీద చదునుగా ఉన్న ప్లేట్ పెట్టి దానిమీద ఏదైనా బరువు ఉంచి 30 నిమిషాలు వదిలేయండి.
30 నిమిషాల తరువాత ముక్కలుగా కోసుకుని ఎయిర్-టైట్ డబ్బా లో పెట్టి ఫ్రిడ్జ్ పెడితే 4-5 రోజు నిలవుంటాయ్.
ఫ్రిజ్ లోంచి తీసి వాడుకునే ముందు 10 నిమిషాలు వేడి నీటిలో ఉంచి వాడుకోండి.