హోటల్ స్టైల్ పూరీ కర్రీ

Breakfast Recipes | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 2 tsps నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 tsp శెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 ఎండు మిర్చి
  • 250 gms పొడవుగా చీరుకున్న ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి
  • ఉడికించిన చిన్న బంగాళా దుంప
  • 1 tsp అల్లం తరుగు
  • 1 tsp నిమ్మరసం
  • 2 tsp శెనగపిండి
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 1/2 cup నీళ్ళు
  • 1/2 liter కూర ఉడికించడానికి నీళ్ళు

విధానం

  1. ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒక దాని వెంట మరొకటి వేస్తూ ఎర్రగా వేపుకోవాలి.
  2. పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు , పసుపు వేసి ఉల్లిపాయాలని 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేపుకోండి.
  3. ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి మూతపెట్టి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఉడకనివ్వాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయాల్లో శెనగపిండి లో గడ్డలు లేకుండా నీళ్ళు పోసుకుంటూ కలిపి కూరలో పోసుకోవాలి, ఇంకా అల్లం తరుగు కూడా వేసి కలుపుకోవాలి.
  5. శెనగపిండి కూరలో కలిసిపోయాక, ఒక బంగాళా దుంప కూరలో చిదిమి వేసుకోవాలి.
  6. 2 నిమిషాలు కూర ఉడికాక స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసి కలిపి దింపేసుకోవాలి.