హైదరాబాద్లో ఎంతో ఫెమస్ అయిన బావార్చి స్టైల్ మటన్ బిర్యానీ

Non Veg Biryanis | nonvegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 45 Mins
  • Servings 7

కావాల్సిన పదార్ధాలు

  • ఉల్లిపాయలు వేపుకోడానికి
  • 1/4 kilo ఉల్లిపాయ చీలికలు
  • 1/2 cup నూనె (125 ml)
  • మాంసం నానబెట్టడానికి
  • 1 kilo లేత మాంసం
  • 1/4 cup పచ్చిబొప్పాయి తోలు
  • 4 పచ్చిమిర్చి
  • 1/2 tsp జాజికాయ పొడి
  • 2 - 2 1/2 అల్లం వెల్లులి పేస్ట్
  • మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు
  • 3 1/2 tsp ఉప్పు
  • 2 tsp ధనియాల పొడి
  • 2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 3 tbsp కారం
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp గరం మసాలా
  • 1 tsp షాహీ జీరా
  • 6 - 7 లవంగాలు
  • 2 inch దాల్చిన చెక్క
  • 2 బిర్యానీ ఆకులు
  • 5 యాలకలు
  • 2 మరాఠీ మొగ్గలు విరిచినవి
  • వేపుకున్న ఉల్లిపాయ తరుగు - సగం
  • ఒక నిమ్మకాయ రసం
  • 1.5 tbsp నెయ్యి
  • 250 ml పెరుగు
  • 1 tbsp కుంకుమ పువ్వు పాలు
  • పుదీనా తరుగు - చిన్న కట్ట
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • రైస్ ఉడికించడానికి
  • 3 liters నీళ్లు
  • 5 యాలకలు
  • 10 - 12 లవంగాలు
  • 4 నల్ల యాలక
  • 4 inches దాల్చిన చెక్క
  • 2 మరాఠీ మొగ్గలు (తుంపినవి)
  • 1 tbsp షాహీ జీరా
  • 2 అనాసపువ్వు
  • పత్తర్ పూల్ - కొంచెం
  • పుదీనా - చిన్న కట్ట
  • కొత్తిమీర- చిన్న కట్ట
  • ఒక నిమ్మకాయ రసం
  • జాపత్రి - కొంచెం
  • 3 బిర్యానీ ఆకులు
  • 3 - 4 tbsps ఉప్పు
  • 1/2 kilo బాస్మతి బియ్యం (గంటసేపు నానబెట్టినది)
  • ధమ్ చేసుకోడానికి
  • పిండి ముద్ద
  • 80 ml నెయ్యి
  • 125 ml రైస్ని ఉడికించుకున్న నీరు (మాంసంలో కలపడానికి)
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఫ్రైడ్ ఆనియన్ - మిగిలినది
  • 1/4 cup కుంకుమ పువ్వు పాలు
  • 4 tbsp రైస్ని ఉడికించున్న నీళ్లు (ధం చేసుకోడానికి)
  • 1/4 tsp గరం మసాలా

విధానం

  1. ఉల్లిపాయ చీలకల్ని అరకప్పు మరిగే వేడి నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  2. ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు వెంటనే తీసి జల్లెడలో వేసి వదిలేస్తే చల్లారేపాటికి మాంచి రంగు వచ్చేస్తాయి.
  3. పచ్చి బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి జాజికాయ పొడి కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  4. అడుగు మందంగా ఉండే గిన్నెలో మాంసం వేసుకోండి అందులో మాంసం నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసుకోండి.
  5. మసాలాలని మాంసానికి బాగా పట్టించి మాంసాన్ని మసాలాలతో గట్టిగా రుద్దుతూ ఎత్తి గిన్నెకేసి కొడుతూ 5-6 నిమిషాల పాటు మసాలాలు పట్టించి. ఫ్రిజ్లో కనీసం 3 గంటలు ఉంచండి. రాత్రంతా ఉంచగలిగితే ఎంతో బాగుంటుంది.
  6. అరకిలో బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి.
  7. నీళ్లని మరిగించండి. మరిగే నీళ్లలో మసాలా దినుసులు అన్నీ వేసి హై-ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు తెర్ల కాగనివ్వాలి.
  8. తెర్లుతున్న ఎసరులోంచి ½ కప్పు నీళ్లు తీసుకుని మూడు గంటలు నానుతున్న మాంసంలో కలుపుకోండి. ఇలా ఎసరు నీళ్లు కలిపితే మాంసం అడుగుపెట్టాడు. ధం అయ్యాక మాసాల పొడిగా అవ్వదు.
  9. మరుగుతున్న ఎసరు సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. ఉప్పు చాలకపోతే వేసుకోండి. మరుగుతున్న ఎసరులో బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద 50% ఉడికించుకోండి.
  10. 50% అంటే సగం ఉడికి ఉండాలి. నోట్లో ఒక గింజ వేసుకుంటే తెలిసిపోతుంది. అలా 50% ఉడికిన అన్నాన్ని సగం పైన తీసుకుని మాంసం అంతా వెదజల్లండి(గరిటతో అదమకండి).
  11. తరువాత 60% ఉడికిన అన్నం సగం వేసుకోండి. ఇంకో 3 నిమిషాలకి 7-% ఉడికిపోతుంది అది వేసుకోండి మసాలాలతో సహా.
  12. బిర్యానీ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కుంకుమ పువ్వు పాలు, నెయ్యి వేపిన ఉల్లిపాయ తరుగు, ఎసరు నీళ్లు అంచుల వెంట పోసుకోండి.
  13. బిర్యానీ గిన్నె అంచుల వెంత తడి చేసి పిండి ముద్ద ఉంచండి. తరువాత మూత పెట్టి ధామ్ బయటికి పోకుండా మూత పెట్టి మూత మీద బరువు ఉంచండి.
  14. పెనం మీదికి బిర్యానీ గిన్నె ఎక్కించి స్టీమ్ బయటకి వేగంగా వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద ధం చేసుకోండి. స్టీమ్ వేగంగా వచ్చాక మంట పూర్తిగా తగ్గించి మరో 25 నిమిషాలు ధామ్ చేసి స్టవ్ ఆపేసి పెనం మీద 30 నిమిషాలు వదిలేయండి.
  15. 30 నిమిషాల తరువాత అడుగు నుండి నెమ్మదిగా తీసి ఘుమఘుమలాడే బెస్ట్ హైదరాబాదీ కచ్చి ఘోష్కి బిర్యానీని చల్లని రైతాతో ఆనందించండి.