చిటికెడు కుంకుమ పువ్వు (1 పెద్ద చెంచా వేడి నీటిలో నానబెట్టిన)
విధానం
½ కిలో లేత చికెన్లో చికెన్ మసాలా కోసం సిద్ధంగా ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి ముక్కలని రుద్దుతూ బాగా పట్టించండి.
ఇది సుమారు 2 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచండి. రాత్రంతా ఉంచితే ముక్క బాగా జూసీగా చాల బావుంటుంది. ఫ్రిజ్ అందుబాటులో లేని వారు బయటే రెండు గంటల పాటు ఉంచండి.
రెండు లీటర్ల నీళ్ళని మరిగించి అందులో బిరియాని సామానంత వేసుకోండి. నీళ్ళు బాగా మరిగాక అప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యని వేసి కేవలం పెద్ద మంట మీదే 70% కుక్ చేసుకోండి. బియ్యం సగం పైన ఉడికితే అది 70% అని గుర్తు (ఇంకా కాస్త పల్కుంటుంది అని గుర్తుంచుకోండి)
అడుగు మందంగా ఉన్న గిన్నెలో నానబెట్టిన చికెన్ ఆ పైన సగం పైన ఉడికిన బాస్మతి బియ్యాన్ని మాసాలాలతో పాటు పూర్తిగా వడకట్టి చికెన్ పైన వేసుకోండి.
ఇప్పుడు అన్నం పైన కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు వేసి టిష్యూ పేపర్స్ తో లేదా అరిటాకుతో కవర్ చేసి ఆవిరి బయటకి పోకుండా గట్టి మూత పెట్టెయ్యండి.
ఇప్పుడు 8 నిమిషాలు మీడియం ఫ్లేం మీద, 7 నిమిషాలు సన్నని మంట మీద ధం చేసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు కదపకండి.