చికెన్ నానబెట్టుకోడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్కి బాగా పట్టించి కనీసం గంట పైన నాననివ్వాలి.
అచారీ మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా సన్నని సెగ మీద మాంచి పరిమళం వచ్చేదాకా వేపుకుని మెత్తని పొడి చేసుకోండి.
నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తరువాత ఉల్లిపాయ తరుగు కరివేపాకు వేసి ఉల్లిపాయని మెత్తబడనివ్వాలి.
మెత్తబడిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి. వేగిన ముద్దలో గంటపైన నానబెట్టిన చికెన్ వేసి నూనె పైకి తేలేదాక హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి.
15 నిమిషాలు వేగిన తరువాత చికెన్లోంచి నూనె పైకి తేలుతుంది అప్పుడు 1 కప్పు నీళ్లు, గ్రైండ్ చేసుకున్న అచారీ మసాలా పొడి కొద్దిగా మిగిల్చి మొత్తం వేసి కలిపి మూత పెట్టి 20 నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుతూ నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి.
చికెన్ ముక్క మెత్తబడి నూనె పైకి తేలాక బాగా కలిపి నిమ్మరసం మిగిల్చుకున్న మసాలా పొడి వేసి కలిపి దింపి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
30 నిమిషాల తరువాత వేడి అన్నం, బాగారా అన్నం లేదా రొటీస్తో సర్వ్ చేసుకోండి.