ఆంధ్రా స్టైల్ ఇన్స్టంట్ కేరట్ పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 7 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm కేరట్ తురుము
  • 1.5 tsp నూనె
  • 1/2 tsp మెంతులు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1 tbsp సెనగపప్పు
  • 2 ఎండుమిర్చి
  • 3 - 4 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • ఇంగువ చిటికెడు
  • కొత్తిమీర - కొద్దిగా
  • చింతపండు - ఉసిరికాయంత
  • తాలింపు కోసం
  • 1.5 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి ముక్కలు
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో మెంతులు ఆవాలు వేసి మెంతులు ఎర్రగా అయ్యేదాకా వేగనివ్వాలి.
  2. మెంతులు వేగి మాంచి సువాసన వస్తుండగా మినపప్పు సెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. తరువాత ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి రంగు మారాక ఇంగువ కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు చింతపండు వేసి స్టవ్ ఆపేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
  4. చల్లారిన తాలింపుని మెత్తని పొడి చేసుకోండి.
  5. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసి మాంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి , తరువాత కరివేపాకు వేసి వేపుకోండి.
  6. వేగిన తాలింపు స్టవ్ ఆపేసి కేరట్ తురుము గ్రైండ్ చేసుకున్న తాలింపు పొడి ఉప్పు వేసి కలిపి గంట సేపు వదిలేస్తే తాలింపు పరిమళం ఉప్పు కారాలు బాగా పట్టుకుంటుంది పచ్చడి.