ఇన్స్టంట్ కుల్ఫీ 5 నిమిషాల్లో | బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ

Summer Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 5 Mins
  • Total Time 10 Mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup గోరు వెచ్చని పాలు (250 ml)
  • 2 Slices మిల్క్ బ్రెడ్
  • 1 cup కండెన్సడ్ మిల్క్
  • 1 cup ఫ్రెష్ క్రీమ్
  • 1 tsp యాలక పొడి
  • వేడి పాలల్లో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు
  • 1/4 cup బాదం , పిస్తా పలుకులు

విధానం

  1. బ్రెడ్ అంచులని తీసేయండి. గోరువెచ్చని పాలల్లో మూడు నిమిషాలు నానబెట్టాలి
  2. నానిన బ్రెడ్ ని మిక్సీ లో వేసి మిగిలిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి
  3. కుల్ఫీ మౌల్డ్స్ లో పిస్తా బాదాం పలుకులు వేసి మిల్క్ ని మౌల్డ్స్ లో నింపి గట్టిగా మూతపెట్టి ఒరిగి పోకుండా బియ్యం పోసిన గిన్నెలో గుచ్చి 12 గంటలు ఫ్రీజ్ చేయాలి.
  4. 12 గంటల తరువాత పుల్ల గుచ్చి నీళ్ళలో 3-4 సెకన్లు ఉంచితే మౌల్డ్స్ నుండి విడిపడుతుంది కుల్ఫీ
  5. ఈ కుల్ఫీ తో ఫాలూదా కూడా చాలా బాగుంటుంది.