మసాలా దోశ | ఇన్స్టంట్ మసాలా దోశ రెసిపీ | దోశ రెసిపీ | మసాలా దోశ రెసిపీ

Breakfast Recipes | vegetarian

  • Prep Time 15 Mins
  • Cook Time 30 Mins
  • Resting Time 10 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • ఆలూ మసాలా కోసం:
  • 2 ఉడికించుకున్న ఆలూ
  • 4 tbsp నూనె
  • 3 tbsp జీడిపప్పు
  • 1 tsp ఆవాలు
  • 1 tbsp పచ్చిశెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1 tbsp అల్లం తురుము
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 2 slit పచ్చిమిర్చి చీలికలు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ¼ tsp పసుపు
  • 2 sprigs కరివేపాకు
  • ఇంగువ (కొద్దిగా)
  • ⅓ cup నీరు
  • ¼ cup కొత్తిమీర తరుగు
  • గోధుమ పిండి దోశ కోసం:
  • 2 cups గోధుమపిండి
  • 2 tbsp బొంబాయి రవ్వ
  • 4 tbsp బియ్యం పిండి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ¼ tsp వంట సోడా
  • 2 - 2. ¼ cups నీరు
  • నూనె (అట్టు కాల్చుకోడానికి )

విధానం

  1. గోధుమ పిండిలో అట్టు పిండికి కావలసిన పదార్ధాలన్నీ వేసి గడ్డలు లేకుండా బాగా వేగంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి.
  2. బాగా బీట్ చేసుకున్న పిండిని కనీసం పది నిమిషాలు ఊరనివ్వండి.
  3. నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  4. నూనెలో ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకొవాలి. వేగిన పప్పుల్లో జీలకర్ర ఇంగువ అల్లం తరుగు వేసి వేపుకోవాలి.
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోండి.
  6. రంగు మారి మెత్తబడిన ఉల్లిలో పసుపు ఉడికించుకున్న ఆలూని చిదిమి వేసుకుని బాగా కలిపి నీరు పోసి దగ్గరగా ఉడికించుకోండి.
  7. ఉడికిన ఆలూలో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.