కాల్షియమ్ రిచ్ రాగి దోశ

Breakfast Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 3 Mins
  • Resting Time 30 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రాగి పిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • 5 ఎండుమిర్చి
  • 1 tsp సొంపు
  • 1/3 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • కొత్తిమీర – కొద్దిగా
  • వేడి నీళ్ళు – తగినన్ని
  • నూనె – అట్లు కాల్చుకోడానికి

విధానం

  1. మిక్సీలో ఎండుమిర్చి, సొంపు వేసి మెత్తని పొడి చేసుకోడని
  2. గిన్నెలో రాగిపిండి, ఎండుమిర్చి సొంపు పొడితో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండి అట్ల పిండి జారు కలిపి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి
  3. బాగా వేడెక్కిన పెనం మీద పిండి పోసి అంచుల వెంట కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చి తీసుకోండి. (అట్టు కాల్చే విధానం టిప్స్లో చూడండి)
  4. ఇవి వేడిగా చల్లగా ఎలా అయినా కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్.