సేమియా ఊతప్పం రెసిపీ | సేమియా ఊతప్పం

Breakfast Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup పెరుగు
  • 1 Cup రవ్వ
  • 1 Cup సేమియా
  • 1/2 Cup వంట సోడా
  • 1/2 Piece అల్లం
  • 3 పచ్చిమిర్చి
  • నూనె - ఊతప్పం కాల్చుకోవడానికి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 ¼ Cups నీరు
  • తాలింపు కొరకు:
  • 1/2 tbsp నూనె
  • 1/3 Cup ఉల్లిపాయ తరుగు
  • 1/2 tsp జీలకర్ర
  • కరివేపాకు - 2 రెబ్బల తరుగు

విధానం

  1. పెరుగులో, వంట సోడా కలిపి 30 సెకన్లు వదిలెయ్యండి . పెరుగు పొంగుతుంది.
  2. అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోండి.
  3. పొంగిన పెరుగులో, రవ్వ, సేమియా, ఉప్పు, నీరు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు వదిలేయ్యండి. పిండి పొంగుతుంది సేమియా మెత్తబడుతుంది.
  4. నూనె వేడి చేసి, ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి ఒక నిమిషం వేపి, పులిసిన పిండిలో కలిపేయ్యండి.
  5. పెనంని వేడి చేసి, పెద్ద గరిటెడు పిండిని పెనం మీద పోసి నెమ్మదిగా తడితే, కాస్త స్ప్రెడ్ అవుతుంది పిండి.
  6. పిండి అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చండి. తరువాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కాల్చి వేడి వేడిగా నచ్చిన పచ్చడి సాంబారుతో సర్వ్ చేసుకోండి.