కడిగి నీడన ఆరబెట్టినా కరివేపాకులో చెమ్మ ఆరిపోయేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి. తరువాత పక్కనుంచుకోవాలి.
మూకుడులో ధనియాలు జీలకర్ర వేసి మాంచి పరిమళం వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన దినుసుల్లో దంచిన శొంఠి మిరియాలు వాము వేసి సన్నని సెగమీదే వేపుకోవాలి.
వేగిన దినుసులని ప్లేట్లోకి తీసుకుని ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన దినుసులని మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
గ్రైండ్ చేసుకున్న మెత్తని పొడి జల్లించి ఇంకా మెత్తని పొడి వచ్చేదాకా జల్లించండి. మిగిలిన పొడిని మళ్ళీ జల్లించండి. ఆఖరుగా మిగిలిన చెంచాడు పొడిని మజ్జిగ పొడిలో వేసి కలుపుకోండి.
గిన్నెలో కప్పు పెరుగు తీసుకోండి ఇందులో tbsp మజ్జిగ పొడి వేసి బాగా చిలుక్కోవాలి. తరువాత తగినన్ని చల్లని నీళ్లు పోసి బాగా చిలికి సర్వ్ చేయండి.