కాజు మఖాన కర్రీ

Veg Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 75 gms జీడిపప్పు గుండ్లు
  • 1 cup పూల్ మఖానా (పెద్ద కప్పు)
  • గ్రేవీ కోసం:
  • 4 tbsp నూనె
  • 1 inch అల్లం
  • 7 - 8 వెల్లులి
  • 1 cup ఉల్లిపాయ
  • 1/4 cup ఎండుకొబ్బరి
  • 4 - 5 పచ్చిమిర్చి
  • 1/4 cup మిరియాలు
  • 1 tbsp గసగసాలు
  • 2 టమాటో
  • 1/2 cup పెరుగు
  • కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 1/4 tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 1/4 tsp జీలకర్ర పొడి
  • మసాలా గ్రేవీ
  • 1.5 cup నీళ్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tsp నెయ్యి
  • కొత్తిమీర - కొద్దిగా

విధానం

  1. 2 tbsp నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. మిగిలిన నూనెలో మఖనా వేసి సన్నని సెగ మీద కరకరలాడేట్టు వేపి తీసుకోవాలి.
  2. గ్రేవీ కోసం ఇంకో 2 tbsp నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లి పచ్చిమిర్చి కొబ్బరి వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  3. వేగిన ఉల్లిపాయలో గసాలు వేసి చిట్లనివ్వాలి. చిట్లిన గసాల్లో టమాటో ముక్కలు వేసి మెత్తబడేదాకా వేపుకోవాలి.
  4. వేగిన ఉల్లి టమాటో మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోండి ఇంకా ఇందులో పెరుగు వేసి నీళ్లలో క్రీమ్ మాదిరి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. కర్రీ కోసం ఉంచిన నూనె వేడి చేసి అందులో పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా నీళ్ళూ వేసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి.
  6. వేగిన మసాలాల్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాక మధ్య మధ్యన కలుపుతూ గ్రేవీ చిక్కబరచాలి (మరీ చిక్కబడితే కొద్దిగా నీళ్లు పోసి పలుచన చేసుకోండి).
  7. చిక్కబడి నూనె పైకి తేలుతుంది 12-15 నిమిషాలకి అప్పుడు వేపుకున్న జీడీపప్పు మఖానా కొత్తిమీర తరుగు నెయ్యి వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  8. ఈ కర్రీ స్పైస్ రోటీలు చపాతీతో పర్ఫెక్టుగా ఉంటుంది, ఇంకా స్పైసీ పులావుతో కూడా సరిపోయేలా ఉంటుంది. అదే వైట్ రైస్లోకి అయితే మసాలాల మోతాదు కొంచెం పెంచుకోండి.