ముందుగా కుక్కర్ లో నూనె, నెయ్యి వేడి చేసుకుని, అందులో లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు, షాజీరా వేసి ఫ్రై చేసుకోండి.
ఒక ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సగం పైన ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. జీడిపప్పు ఎర్రగా వేగితేనే రుచి చాల బావుంటుంది.
జీడిపప్పు సగం పైన వేగి రంగు మారుతుండగా పచ్చి మిర్చి చీలికలు, పుదినా, కొత్తిమీర, అల్లం వేల్లూలి పేస్టు వేసి పచ్చి వాసనా పోయేదాక వేపుకుని సాల్ట్, పసుపు వేసి వేపుకోండి.
కప్ నీళ్ళు పోసుకుని నానా బెట్టిన బాస్మతి బియ్యం వేసుకోండి (ఇక్కడ సోన మసూరి బియ్యం వాడుకుంటే గనుక బియ్యం గంటకు పైగా నానబెట్టాలి, 1.3/4 cup నీళ్ళు పోసుకోవాలి)
ఎసరులోనే ఎండిన దేశవాళీ గులాబి రేకులు 1 tsp వేసుకోండి. ఇది లేకపోతే పులావు దింపే ముందు 1/2tsp రోజ్ వాటర్ వేసుకోండి.
కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 whistle రానివ్వండి. సోనా మసూరి బియానికి అయితే 2 కూతలు రానివ్వండి.
ఆ తరువాత 15 నిమిషాలు కదపకుండా వదిలేయండి.(ఇది చాల ముఖ్యం)
15 నిమిషాల తరువాత అడుగు నుండి అట్ల కాడతో కలుపుని సర్వ్ చేసుకోండి.