కాకరకాయ కారం రెసిపి | గుంటూరు కాకరకాయ కారం | గుంటూరు కారం

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 60 Mins
  • Resting Time 30 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కాకరకాయ ముక్కలు ఊరబెట్టానికి:
  • ½ kg చెక్కు తీసుకున్న కాకరకాయ ముక్కలు
  • 1 tsp పసుపు
  • 1 tsp ఉప్పు
  • కాకరకాయ ముక్కలు ఉడికించడానికి:
  • 1 cup పుల్లని మజ్జిగ
  • చింతపండు - చిన్న ఉసిరికాయంత
  • కాకరకాయ కారం పొడి కోసం:
  • 3 tbsp నూనె
  • 2 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 ¼ tbsp ఉప్పు
  • ½ cup వెల్లుల్లి
  • 4 - 5 tbsp కారం
  • కాకరకాయ కారం కోసం:
  • ½ cup నూనె
  • ¼ cup బెల్లం

విధానం

  1. ½ కిలో కాకరకాయలని చెక్కు తీసేసి 1/2 అంగుళం ముక్కలుగా కోసుకోండి.
  2. కోసుకున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ముప్పై నిమిషాలు ఊరనివ్వాలి. ఊరిన ముక్కుల్లోంచి నీటిని గట్టిగా పిండేసుకోవాలి.
  3. చేదు నీరు పిండేసుకున్న కాకరకాయ ముక్కల్లో పుల్లని మజ్జిగా చింతపండు వేసి మజ్జిగ ఇగిరిపోయేదాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మజ్జిగ ఇగిరిపోయాక దింపేసుకోవాలి.
  4. కాకరకాయ కారం కోసం నూనె వేడి చేసి సెనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి పప్పు మాంచి సువాసన వచ్చేదాకా ఎర్రగా నిదానంగా వేపుకోవాలి.
  5. వేగిన పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకోండి. అందులో మిగిలిన పదార్ధాలు వేసి కేవలం 3-4 సార్లు మాత్రమే పల్స్ చేసి తీసుకోవాలి. ఈ పల్స్ కేవలం అన్నీ కలవడానికి ఇంకా వెల్లులి కచ్చా పచ్చాగా నలగడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి.
  6. ఇప్పుడు కాకరకాయ కరం కోసం నూనె వేడి చేసి అందులో మజ్జిగలో మగ్గించుకున్న కాకరకాయ ముక్కలు వేసి లేత బంగారు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగేప్పుడు చింతపండు పిక్కలు కనిపిస్తే తీసేయండి.
  7. కాకరకాయ ముక్కలు రంగు మారి గట్టిపడతాయి అప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లులి కారం బెల్లం తురుము వేసి బాగా కలిపి కేవలం రెండు పొంగులు రానిచ్చి దింపేసుకోండి. లేదంటే కారం మాడిపోతుంది.
  8. 2-3 గంటల తరువాత కాకరకాయ కారం చల్లారుతుంది అప్పుడు సీసాలోకి తీసుకుంటే కనీసం నెల రోజుల పైన నిల్వ ఉంటుంది.