కలాకంద్ | ఇంతవరకు ఎవ్వరు చెప్పని నిజమైన టిప్స్ తో | ఇది అసలైన పద్ధతి

Sweets | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 45 Mins
  • Resting Time 300 Mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 2 liters చిక్కటి పాలు
  • 1/2 cup పంచదార
  • 2 Pinches నిమ్మ ఉప్పు
  • 1/2 cup నీళ్ళు

విధానం

  1. కచ్చితంగా అడుగు మందంగా లోతుగా ఉన్న మూకుడులో మాత్రమే 1/2 కప్ నీళ్ళు పోసి అందులో చిక్కటి పాలు పోసి కలుపుతూ పాలని ఇగరబెట్టాలి.
  2. పాలు పొంగువచ్చాక మరో 15-20 నిమిషాలు మరిగించండి అప్పుడు కాస్త చిక్కబడతాయ్. అప్పుడు పాలల్లో పంచదార వేసి కలుపుతూ హై-ఫ్లేం సగం పైన ఇగరబెట్టాలి.
  3. పాలు సగం పైన చిక్కబడ్డాక ¼ కప్ నీళ్ళలో నిమ్మ ఉప్పు వేసి కలిపి కరిగించి పక్కనుంచుకోండి.
  4. ఇప్పుడు సగం పైన ఇగిరిన పాలల్లో కొద్ది కొద్దిగా నిమ్మ ఉప్పు నీరు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
  5. పాలు విరిగేదాకా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. (నిమ్మ ఉప్పు నీరు/ నిమ్మరసం అనేది పాల చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది).
  6. మొత్తంగా నాకు కలాకంద్ని హై-ఫ్లేం మీద 50 నిమిషాలు కలిపాక పూసలు పూసలుగా ఖోవా దగ్గరపడింది.
  7. పూసలు కట్టి దగ్గర పడ్డ కలాకంద్ ఇంకా కాస్త పాలు ఉండగానే ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆపేసి దింపి మూకుడు అంచులకి పలుచగా స్ప్రెడ్ చేసి 30 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వాలి.
  8. ఆ తరువాత నెయ్యి రాసిన ట్రే లో కలాకంద్ వేసి స్ప్రెడ్ చేసి 4-5 గంటలు ఆరనివ్వాలి, అప్పుడే ముక్కలు కోసందుకు వస్తుంది.
  9. 4-5 గంటలు లేదా రాత్రంతా చల్లారబెట్టాక ముక్కలుగా కోసుకోండి.