సెనగపిండి, బియ్యం పిండి, నీళ్ళు పోసి పిండిని గడ్డలు లేకుండా గరిట జారుగా కలుపుకోవాలి.
హై ఫ్లేం మీద నూనె ని మసల కాగనివ్వండి.
నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బూంది దూసే గరిట మీద గరిటడు పిండి పోసి, నిదానంగా అట్లు పోసినట్లు పిండిని గరిటతో తిప్పితే , అప్పుడు చక్కగా బూంది గరిట లోంచి కిందికి జారుతుంది.
నూనెలో పడ్డ బూందిని కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే వేపుకోవాలి, బూంది ఎర్రగా వేగాక తీసి పక్కనుంచుకోండి.
ఇప్పుడు అదే నూనె లో వేరుసెనగపప్పు, కరివేపాకు వేసి వేపుకుని బూందిలో వేసుకోండి.
తరువాత సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేడి మీద బూందికి బాగా పట్టించండి.
పూర్తిగా చల్లారాక బూందిని డబ్బాలో దాచుకుంటే కనీసం 15 రోజులు నిలవుంటాయ్.