మినపప్పుని కడిగి కనీసం నాలుగు గంటలు నానబెట్టి ఆ తరువాత వాడకట్టిన పప్పులో ఉప్పు చల్లని నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
నానబెట్టిన పెసరపప్పులో 1.1/4 కప్పుల నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
సూప్ కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పకచిమరిచి తరుగు, అల్లం, వెల్లులి ఇంగువ వేసి వేపుకోవాలి.
తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా మూతపెట్టి మగ్గించుకోవాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు ,కారం వేసి టొమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాక ఉడికించుకోవాలి.
గుజ్జుగా అయిన టొమాటోలో పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేసి నీళ్ళు పోసి 10 నిమిషలు మూతపెట్టి మరిగించుకోవాలి.
బాగా మరిగిన సూప్లో పచ్చికొబ్బరి తురుము, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.
మెత్తగా రుబ్బుకున్న పిండిని ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత చేతులు తడి చేసుకుని వేడి నూనెలో పెద్ద బొండాల మాదిరి వేసి ఎర్రగా వేపుకోవాలి.
బొండాలు ఎర్రగా బంగారు రంగులోకి వేగాక సూప్లో వేసి 5 నిమిషాలు ఉంచి సూప్తో పాటు సర్వ్ చేసుకోండి.