కట్టే పొంగలి | ఆంధ్రా స్టైల్ కట్టే పొంగల్

Lunch box Recipe | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup దోశ బియ్యం/కంట్రోల్ బియ్యం
  • 1 cup పెసరపప్పు
  • 5 cups నీళ్ళు
  • తాలింపు కోసం
  • 1/3 cup జీడిపపు
  • 1 tbsp జీలకర్ర
  • 1/2 cup నెయ్యి
  • 1 tbsp మిరియాలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 pinches ఇంగువ
  • 1 tbsp అల్లం తరుగు

విధానం

  1. ముందుగా బియ్యంని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోండి
  2. ముకుడులో పెసరపప్పు వేసి లో-ఫ్లేం మీద మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకోవాలి. ఆ తరువాత కడుక్కోవాలి
  3. విడిగా వండితే అడుగు మందంగా ఉన్న గిన్నె లో మాత్రమే 5 కప్స్ నీళ్ళు పోసుకుని సాల్ట్, కడిగిన బియ్యం, కడుక్కున్న పెసరప్పు వేసి మీడియం ఫ్లేం మీద 30 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి.
  4. అన్నం మెత్తగా ఉడికాక స్టవ్ ఆపేసి పక్కనుంచుకోండి
  5. ఇదే పొంగల్ కుక్కర్లో అయితే పొంగల్ పదార్ధాలన్నీ వేసి 5 కూతలు రానిచ్చి తాలింపు వేసుకోండి
  6. పొంగల్లోకి తాలింపు కోసం నెయ్యి కరిగించుకుని అందులో మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా వేపుకుని కలుపుకుని దిమ్పెసుకోండి.