కేసర్ బాదం కత్లీ

Sweets | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 40 Mins
  • Servings 25

కావాల్సిన పదార్ధాలు

  • 1.5 cup బాదాం (225 gm)
  • నీళ్ళు
  • 1/3 cup పాలు
  • 200 gm పంచదార
  • 1 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు (చిటికెడు కుంకుమపువ్వు tbsp నీళ్ళలో నానబెట్టినది)

విధానం

  1. బాదం పప్పులో నీళ్ళు పోసి సులభంగా తోలు ఊడే దాకా మూతపెట్టి ఉడికించుకోవాలి.
  2. మెత్తగా ఉడికిన బాదంని వేళ్ళ మధ్యన పిండితే తోలు సులభంగా ఊడిపోతుంది. తోలు తీసుకున్న బాదంని నీళ్ళలో వేసుకోండి.
  3. బాదంని వడకట్ట మిక్సీలో వేసి ముందు రవ్వగా చేసుకోండి తరువాత పాలు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. అడుగుమందంగా ఉన్న మూకుడులో బాదం పేస్ట్ పంచదార వేసి దగ్గర పడేదాకా అడుగుపట్టకుండా కలుపుతూనే ఉండాలి.
  5. బాదం పేస్ట్ ముకుడుని వదిలి ముద్దగా అవుతున్నప్పుడు కుంకుమపువ్వు నీళ్ళు పోసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలిపి చిన్న ఉండ వేళ్ళమధ్య పెట్టి నలిపితే ఉండ కట్టాలి.
  6. ఉండ కడితే స్టవ్ ఆపేసి మూకుడు అంచులకి పల్చగా కత్లీని పూసి గాలికి 5 గంటలు వదిలేయాలి.
  7. 5 గంటల తరువాత అట్ల కాడతో గీరితే వచ్చేస్తుంది, ఆ తరువాత చపాతీ పిండిలా పగుళ్లు లేకుండా వత్తుకోవాలి.
  8. బదమ పిండి ముద్దని అప్పడాల కర్రతో ¼ ఇంచ్ మందాన, అంచులని సర్దుకుంటూ సమానంగా వత్తుకోవాలి.
  9. తరువాత చదరంగా ఉండే కప్తో రుద్దితే నున్నగా అవుతుంది అప్పుడు పైన సిల్వర్ ఫాయిల్ వేసి డైమేండ్స్గా కట్ చేసుకోండి.