ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి కరిగించి, అందులో యాలకలు, లవంగాలు, చెక్కా, అనాసపువ్వు, జాజి కాయ, బిరియాని ఆకు వేసి వేయించుకోండి.
జీలకర్ర, సోంపు వేసి వేయించి ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వాలి .
అల్లం వెల్లూలి ముద్ద వేసి వేయించి అందులో పండిన టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు కారం, గరం మసాల వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా నిదానంగా కుక్ చేసుకోండి.
½ కప్ కమ్మటి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ నిదానంగా పెరుగులోంచి నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ కుక్ చేసుకోండి.
నెయ్యి పైకి తేలాక కొత్తిమీర, పుదినా తరుగు వేసి బాగా కలుపుకుని గంట పాటు నానా బెట్టిన బాస్మతి బియ్యం వడకట్టి వేసి, నిదానంగా గింజ విరగకుండా ఓ నిమిషం పాటు వేపుకోండి హై-ఫ్లేం మీద.
కప్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే ఓ విసిల్ రానిచ్చి, 20 నిమిషాలు వదిలేయండి.
20 నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి అడుగునుండి అట్లకాడతో కలుపుకొండి. అంతే ఘుమఘుమలాడే ఖుస్కా తయార్.
రైతా తో, ఏదైనా మసాలా కర్రీ తో, నాన్ వెజ్ కర్రీస్ తో ఎలా తిన్నా చాలా బాగుంటుంది.