బెంగాలీ స్పెషల్ స్వీట్ని లవంగ్ లతికా

Sweets | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 25 Mins
  • Servings 14

కావాల్సిన పదార్ధాలు

  • పిండి కోసం
  • 250 gms మైదా
  • 1/2 tsp వంట సోడా
  • 4 tbsp నెయ్యి
  • నీళ్ళు తగినన్ని
  • 15 లవంగాలు
  • నూనె – వేపుకోడానికి
  • స్టఫ్ఫింగ్ కోసం
  • 100 gms పచ్చి కోవా (పంచదార వేయనిది)
  • 1 tbsp బొంబాయ్ రవ్వ
  • 1/2 tsp యాలకలపొడి
  • పాకం కోసం
  • 400 gms పంచదార
  • 1/2 cup నీళ్ళు

విధానం

  1. మైదాలో సోడా నెయ్యి వేసి బాగా కలుపుకుని తగినన్ని నీళ్ళు చేర్చుకుంటూ పగుళ్లులేని మృదువైన పిండిగా వత్తుకోండి.
  2. కోవాలో రవ్వ యాలకలపొడి వేసి కలిపి పక్కనుంచుకోండి.
  3. పంచదారలో నీళ్ళు పోసి లేత జిగురు పాకం వచ్చేదాక మరిగించి దింపేసుకోండి.
  4. వత్తుకున్న పిండిని మళ్ళీ బాగా వత్తి సాగదీసి నిమ్మకాయంత ఉండలుగా చేసుకోండి.
  5. ఉండాలని పొడవుగా వత్తుకోండి, వత్తుకున్న పిండి మీద నీళ్ళతో తడి చేసుకోండి.
  6. గోళీ సైజు కోవా ముద్ద మధ్యలో పెట్టి పై పిండి మధ్యకి మడవాలి, కింద పిండి పై పిండి మీదికి వేసి ఉంచాలి.
  7. పిండి ముద్దని పూర్తిగా తిరగతిప్పి రెండు అంచులని ఒక దాని మీదికి మరొకటి వేసి మధ్యన లవంగం గుచ్చి పక్కనుంచుకోండి.
  8. నూనె తాకగలిగెంత వేడిగా ఉన్నప్పుడు లతికలు అన్నీ వేసి లో-ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  9. లతికలు వేగడానికి కనీసం 12-15 నిమిషాల సమయం పడుతుంది. ఎర్రగా వేగిన లతికలని వేడి పాకంలో వేసి 30 సెకన్లు మునిగేలా ఉంచి తీసి పక్కనుంచుకోండి.
  10. గాలి చొరని డబ్బాలో ఉంచితే వారం పైన నిలవ ఉంటాయ్.