చికెన్ లో పదార్ధాలన్నీ వేసి చికెన్ ముక్కలని బాగా మసాజ్ చేయండి.
మసాజ్ చేసిన చికెన్ని ఫ్రిజ్లో రాత్రంతా లేదా 2 గంటలు ఉంచండి.
ముకుడు వేడి చేసుకోండి. అందులో నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద చికెన్లోని నీరు ఇగిరిపోయేదాక ఫ్రై చేయండి.
చికెన్లోని నీరు ఆవిరై నూనె పైకి తేలాక మంట మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి.
పదిహేను పద్దెనిమిది నిమిషాలకి చికెన్ పూర్తిగా లోపలిదాకా వేగి నూనె వదులుతుంది. అప్పుడు మూత తీసి మరో 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్పీగా అవుతుంది దింపేయండి.
ఈ సింపుల్ లెమన్ చికెన్ ఫ్రై పప్పు పప్పుచారుతో చాలా రుచిగా ఉంటుంది .