మద్రాస్ ఫ్రై ఇడ్లీ

Breakfast Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 6 చల్లారిన ఇడ్లీ (4 ముక్కలుగా చేసినవి)
  • 2 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి ముక్కలు
  • ఉప్పు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 1 cup టొమాటో ముక్కలు
  • 1/3 cup నీళ్ళు
  • 1 tsp నిమ్మరసం
  • 1/4 tsp గరం మసాలా
  • కొత్తిమీర – కొద్దిగా

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేపుకోవాలి
  2. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు లేత గులాబీ రంగు వచ్చే దాకా వేపుకోవాలి
  3. మెత్తబడిన ఉల్లిపాయాల్లో ధనియాల పొడి, కారం వేసి 30 సెకన్లు హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి
  4. టమాటో ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీదే కలుపుతూ గుజ్జుగా అయి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. టొమాటో గుజ్జుగా అయ్యాక నిమ్మరసం, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద కాస్త నీరు మిగిలేదాక ఉడికించుకోవాలి
  6. ఇడ్లీ వేసి గ్రేవీలోని నీరు పీలుచుని గ్రేవీ అంతా ఇడ్లీకి పట్టేలా నెమ్మదిగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీదే రెండు – మూడు నిమిషాలు వేపుకోవాలి
  7. దింపే ముందు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.