బచ్చలి కూర పప్పు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup నానబెట్టిన కంది పప్పు
  • 2 tsp నానబెట్టిన పెసరపప్పు
  • 2 tbsp నానబెట్టిన పచ్చిసెనగపప్పు
  • 1/4 tsp పసుపు
  • 4 పచ్చిమిర్చి
  • 3 కట్టలు బచ్చలి ఆకు తరుగు (250gms)
  • 2 tbsp చింతపండు పులుసు (ఉసిరికాయ అంత చింతపండు నుండి తీసినది)
  • 2 cups నీళ్ళు
  • ఉప్పు
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • ఇంగువ – 2 చిటికెళ్లు
  • 1 కరివేపాకు
  • 1/4 cup టొమాటో ముక్కలు

విధానం

  1. కుక్కర్లో నానిన కందిపప్పు పెసరపప్పు పచ్చిసెనగపపు పసుపు పచ్చిమిర్చి బచ్చయి ఆకు తరుగు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విసిల్స్ రానివ్వాలి.
  2. పప్పు స్టీమ్ పోయాక మెత్తగా ఎనుపుకోండి. పప్పులో ఉప్పు చింతపండు పులుసు పోసి ఒక ఉడుకు రానిచ్చి దింపేసుకోవాలి.
  3. నూనె వేడి చేసి అందులో తాలింపు సామనంతా వేసి తాలింపు ఎర్రగా వేపుకోవాలి.
  4. ఆకారున టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా వేపి పప్పులో కలుపుకోవాలి.