మామిడికాయ కొబ్బరి పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 3 Mins
  • Cook Time 3 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1 1/4 Cup పచ్చి కొబ్బరి
  • 6-8 పచ్చిమిర్చి
  • 1/2 tbsp జీలకర్ర
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 6-7 వెల్లులి
  • 2 tbsp పల్లీలు
  • 1/2 Cup పచ్చి పుల్లని మామిడికాయ ముక్కలు
  • 1 కొత్తిమీర (చిన్న కట్ట)
  • తాలింపు కోసం:
  • 2 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినప్పప్పు
  • 2 pinches ఇంగువ
  • 1 tbsp అల్లం తురుము
  • 2 ఎండుమిర్చి
  • 1/2 tbsp పసుపు
  • 2 Sprigs కరివేపాకు

విధానం

  1. పల్లీలు ఎర్రగా వేపి మిక్సీలోకి తీసుకోండి.
  2. వేగిన పల్లీలతో పాటుగా పచ్చిమిర్చి వెల్లులి ఉప్పు జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి
  3. బరకగా రుబ్బుకున్న తరువాత పచ్చికొబ్బరి కొత్తిమీర వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి
  4. ఆఖరుగా మామిడి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటే వేసిన అన్ని పదార్ధాలు నోటికి తెలిసేలా గ్రైండ్ అవుతాయి.
  5. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి, అప్పుడే తాలింపుకి రుచి.
  6. ఆఖరుగా పసుపు కరివేపాకు వేసి వేపిది పసుపు మాడకుండా వేగుతుంది. వేగిన తాలింపుని పచ్చడిలో కలిపేసుకోండి.
  7. పచ్చడిలో పులుపు తగ్గితే మామిడికాయ తురుము కలుపుకోండి. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.