మంగుళూర్ దోసకాయ సాంబార్

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • సాంబార్ మసాలా కోసం
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1.5 tbsp ధనియాలు
  • 1/2 tsp మిరియాలు
  • 1/4 tsp మెంతులు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 6 బాడిగీ మిర్చి
  • 3 - 5 గుంటూర్ మిర్చి
  • 1 tsp నూనె
  • 1/4 cup కొబ్బరి
  • సాంబార్ కోసం
  • 1/4 cup కంది పప్పు (గంట సేపు నానబెట్టినది)
  • 1.5 cup నీళ్ళు (పప్పు ఉడికించుకోడానికి)
  • చింతపండు – నిమ్మకాయంత
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 1 దోసకాయ (150 gms)
  • 1 ఉల్లిపాయ (పెద్ద ముక్కలు)
  • 1 tsp నూనె
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 2 tsp బెల్లం
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 1 కరివేపాకు
  • 400 ml నీళ్ళు
  • తాలింపు కోసం
  • 2 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 3 ఎండుమిర్చి
  • 1/4 tsp ఇంగువ
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. నానబెట్టిన కండిపప్పుని కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించి ఎనిపి పక్కనుంచుకోండి.
  2. పాన్లో సాంబార్ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేగి మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
  3. పప్పులు వేగిన తరువాత స్టవ్ ఆపేసి పచ్చికొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపి మిక్సీ వేసి నీళ్ళతో మెత్తని వెన్నలాంటి పేస్ట్ చేసుకోండి
  4. సాంబార్ కాచే గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ గింజలు తీసేసిన దోసకాయ ముక్కలు వేసి వక నిమిషం వేపుకోవాలి.
  5. నిమిషం తరువాత 250 ml నీళ్ళు పసుపు ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి
  6. 10 నిమిషాల తరువాత ఉడికించి ఎనుపుకున్న కందిపప్పు, సాంబార్ మసాలా పేస్ట్, మిగిలిన 125ml నీళ్ళు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసి కలిపి మూతపెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సాంబార్ మరగనివ్వాలి.
  7. తాలింపుకోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటచిట అనిపించి ఆ తరువాత ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేపి సాంబార్ లో కలిపేసుకోవాలి. అంతే కమ్మని చిక్కని సాంబార్ వేడిగా అన్నంతో అప్పడం నంజుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుంది.
  8. 15 నిమిషాలకి సాంబార్ చిక్కబడి మసాలాలు బాగా ఉడికి ఘుమఘుమలాడిపోతుంది, అప్పుడు బెల్లం కొత్తిమీర తరుగు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి