కావాల్సిన పదార్ధాలు
-
1
cup మాక్రోనీ
-
3
tbsp నూనె/బటర్
-
1/2
tsp జీలకర్ర
-
3
వెల్లులీ సన్నని తరుగు
-
1/3
cup ఉల్లిపాయ తరుగు
-
2
tsp పచ్చిమిర్చి చీలికల తరుగు
-
ఉప్పు
-
పసుపు – చిటికెడు
-
3/4
tsp కారం
-
1/2
tsp జీలకర్ర పొడి
-
1/2
tsp ధనియాల పొడి
-
1/4
tsp గరం మసాలా
-
1/4
tsp మిరియాల పొడి
-
1/2
cup టొమాటో తరుగు
-
1/4
cup కాప్సికం తరుగు
-
1/4
cup బటానీ
-
2
tbsp కొత్తిమీర
-
1
tsp నిమ్మరసం
-
1/2
cup నీళ్ళు
విధానం
-
నీళ్ళని బాగా మరిగించి నీరు తెర్లుతున్నప్పుడు అందులో మాక్రోనీ వేసి 90% మాత్రమే ఉడికించి, వడకట్టి దింపి చల్లార్చుకోండి
-
పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లులి, పచ్చిమిర్చి తరుగు వేసి వేపి తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి
-
ఉల్లిపాయ వేగాక, టొమాటో తరుగు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి టొమాటో మెత్తబడే దాకా ఉడికించుకోవాలి.
-
టొమాటో సగం పైన ఉడికిన తరువాత కాప్సికం తరుగు వేసి ఒక నిమిషం వేపి నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
-
మరుగుతున్న ఎసరులో ఉడికించిన మాక్రోనీ, బటానీ వేసి నీరు ఇగిరిపోయేదాక ఉడికించుకోవాలి.
-
దింపే ముందు నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేసుకోండి.