మెక్సికన్ రైస్ | సింపుల్ వన్ పాట్ మెక్సికన్ రైస్ రెసిపీ
Bachelors Recipes
|
vegetarian
Prep Time5 Mins
Cook Time25 Mins
Servings4
కావాల్సిన పదార్ధాలు
4
tbsp నూనె
2
tbsp వెల్లులి తరుగు
1
ఉల్లిపాయ (మీడియం సైజు తరుగు)
3/4
cup టొమాటో పేస్ట్ (2 పెద్ద టొమాటోల నుండి తీసినది)
1.5
cup బాస్మతి బియ్యం (250 gm గంట సేపు నానబెట్టినది)
ఉప్పు
1
tsp కారం
3/4
tsp ఒరేగానో
1/2
tsp వేయించిన జీలకర్ర పొడి
1/2
tsp మిరియాల పొడి
2.5
tbsp టొమాటో కేట్చాప్
1/4
cup పసుపు కాప్సికం తరుగు
1/4
cup ఎర్ర కాప్సికం తరుగు
1/4
cup గ్రీన్ కాప్సికం తరుగు
1/4
ఫ్రొజెన్ స్వీట్ కార్న్
1/4
cup ఫోజెన్ బటానీ
1/4
cup ఆలేపినోస్
1/2
చెక్క నిమ్మరసం
1/4
cup ఉడికించిన రాజ్మా
2.5
cup నీళ్ళు
2
tbsp స్ప్రింగ్ ఆనీయన్ తరుగు
2
tbsp కొత్తిమీర తరుగు
విధానం
నూనె వేడి చేసి అందులో వెల్లులీ తరుగు వేసి 30 సెకన్లు వేపి ఉల్లిపాయ తరుగు వేసి ఒక నిమిషం వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయాలో టొమాటో పేస్ట్ మిగిలిన మసాలాలు ఉప్పు అన్నీ వేసి టొమాటోల లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
నూనె పైకి తేలాక ఎల్లో రెడ్ గ్రీన్ కాప్సికం వేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
తరువాత నానబెట్టిన బియ్యం, వేసి 3 నిమిషాలు వేపుకోవాలి, తరువాత ఫ్రొజెన్ కార్న్, బటానీ, రాజ్మా, టొమాటో కేట్చాప్, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి 50% ఉడకనివ్వాలి.
50% ఉడికిన అన్నంలో ఆలేపినోస్, స్ప్రింగ్ ఆనీయన్, కొత్తిమీర, నిమ్మరసం పిండి నెమ్మదిగా కలిపి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికికించి 15 నిమిషాలు వదిలేయాలి. 15 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి.