పుదీనా చారు | పుదీనా రసం

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చారు పొడి కోసం
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp మిరియాలు
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp కందిపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp నూనె
  • చారు కోసం
  • 100 ml చింతపండు పులుసు (పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
  • 400 ml నీళ్ళు
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 1/2 cup కందిపప్పు (మెత్తగా ఉడికించి ఎనుపుకున్నది)
  • మీడియం కట్ట పుదీనా ఆకుల తరుగు
  • తాలింపు కోసం
  • 2 tsp నెయ్యి
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp ఇంగువ
  • 2 ఎండుమిర్చి

విధానం

  1. పాన్లో రసం పొడి సామానంతా వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక వేపుకుని మెత్తని పొడి చేసుకోండి.
  2. గిన్నెలో చింతపండు పులుసు, పసుపు ఉప్పు నీళ్ళు చారు పొడి పోసి చారు ఒక పొంగు వచ్చేదాక మూత పెట్టి మరిగించుకోవాలి.
  3. మరుగుతున్న చారులో మెత్తగా ఎనుపుకున్న పప్పు వేసి ఒక పొంగు రానివ్వాలి. పొంగుతున్న చారులో పుదీనా ఆకులు వేసి 2-3 నిమిషాలు మరగనివ్వాలి ఆ తరువాత దింపేయాలి.
  4. తాలింపు కోసం నెయ్యి వేడి చేసి అవాలు వేసి చిటచిట లాడించి మిగిలిన సమగ్రీ అంతా వేసి మాంచి సువాసన వచ్చేదాక వేపి చారులో కలుపుకోండి. అంతే ఘుమఘుమలాడే పుదీనా చారు తయారు.
  5. ఈ చారు అన్నం ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.