1/4
cup చింతపండు పులుసు (50 gm చింతపండు నుంది తీసినది)
2
రెబ్బలు కరివేపాకు
1/2
tsp బెల్లం (ఆప్షనల్)
విధానం
ముకుడులో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలాన్నీ ఒక్కోటిగా సన్నని సెగమీద వేపుకుంటూ ఆఖరున కొబ్బరి పొడి వేసి వేపుకోవాలి.
ఎర్రగా వేపిన పప్పులని మిక్సీలో వేసి మెత్తని వెన్నలాంటి పేస్ట్ చేసుకోవాలి.
ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసి వేపి, అల్లం వెల్లులి కూడా వేసి వేపుకోవాలి.
వేగిన తాళింపులో కారం ఉప్పు గరం మసాలా పసుపు వేసి వేపి అందులో బజ్జి మిరపకాయ చీలికలు వేసి 3 నిమిషాలు వేపి తరువాత చింతపండు పులుసు పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక మూత పెట్టి మగ్గించాలి.
నూనె పైకి తేలాక మసాలా పేస్ట్ నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి, మరుగుతున్న ఎసరు పైన తేట ఏర్పడుతుంది దాన్ని తీసేయండి. తరువాత మంట తగ్గించి నూనె పైకి తేలేదాక మరిగించాలి.
నూనె పైకి తేలాక కరివేపాకు తరుగు బెల్లం వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.