మిర్చీ బజ్జీ | హైదరాబాద్ స్టైల్ మసాలా మిర్చీ బజ్జీ

Street Food | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 30 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • చింతపండు పేస్ట్ కోసం:
  • 2 tbsp చిక్కని చింతపండు గుజ్జు (50gm చింతపండు నుండి తీసినది)
  • 1/2 tbsp ఆంచూర్ పొడి
  • ఉప్పు
  • 1/2 tbsp కారం
  • 1/2 tbsp వేయించిన జీలకర్ర పొడి
  • బజ్జీల కోసం
  • 1.5 Cup సెనగపిండి
  • 1 Cup నీళ్లు
  • ఉప్పు
  • 1/4 tbsp సోడా
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tbsp వాము
  • 18 మిర్చీలు
  • నూనె (వేపుకోడానికి)
  • చాట్ మసాలా (కొద్దిగా పైన చల్లుకోడానికి)
  • ఉల్లిపాయ తరుగు (బజ్జీలతో పాటు ఇవ్వడానికి)

విధానం

  1. నానబెట్టిన 50gm చింతపండు నుండి చిక్కని పేస్ట్ మాత్రమే తీసుకోవాలి, నీరుగా పులుసు తీసుకోకూడదు.
  2. చింతపండు పేస్టుకి పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి చిక్కని పేస్ట్ చేసుకోండి
  3. బజ్జీ మిరపకాయలని కడిగి అంచున కట్ చేసుకోండి. తరువాత మిర్చీని మధ్యకి చీరుకోండి, లోపలి గింజల్ని దులిపేయండి
  4. మిర్చీలో చిక్కని చింతపండు పేస్ట్ వేలుతో కొద్దిగా తీసుకుని మిర్చిలో పై నుండి కిందికి రాయండి, ఇలాగే అన్నీ చేసుకోండి
  5. సెనగపిండి ఉప్పు సోడా అల్లం వెల్లులి పేస్ట్ నిలిపిన వాము వేసి బాగా కలిపి
  6. తగినన్ని నీళ్లు చేర్చుకుంటూ చిక్కని ఇడ్లీ పిండి మాదిరి కలిపి 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి సెనగపిండిని ఒక పొడవైన గ్లాస్లోకి నింపుకోండి. దీనివల్ల మిర్చీని పిండిలో ముంచి తీసుకోవడం సులభం.
  7. చింతపండు పేస్ట్ పట్టించిన మిర్చీని గ్లాస్లో నింపిన పిండిలో ముంచి బయటకి తీసేప్పుడు గ్లాస్ అంచుకి తాకి తాకనట్లు తాకిస్తూ బయటకి తీస్తే మిర్చీకి మూడు వైపుల పిండి అంటుతుంది ఒక వైపు అంటదు. అప్పుడు వెంటనే మరిగే వేడి నూనెలో వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వండి, ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోండి.
  8. వేడి వేడి మిర్చీ బజ్జీ పైన చాట్ మసాలా కొద్దిగా ఉల్లిపాయ తరుగు చల్లి సర్వ్ చేసుకుంటే హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మిర్చీ బజ్జీ తయారు.