మిక్స్ వెజ్ బటర్ మసాలా | మిక్ వెజ్ మక్కన్వాలా

Restaurant Style Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం
  • 3 టొమాటో
  • 1 ఉల్లిపాయ
  • 15 - 20 జీడిపప్పు
  • 3 కాశ్మీరీ మిరపకాయలు
  • 1/2 tsp పంచదార
  • 1/2 inch దాల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 3 దంచిన యాలకలు
  • 1/3 cup బంగాళాదుంప ముక్కలు
  • 1/3 cup కేరట్ ముక్కలు
  • 3 బేబీ కార్న్ (ఇంచ్ ముక్కలు)
  • 6 ఫ్రెంచ్ బీన్స్ (1 ఇంచ్ ముక్కలు)
  • 15 pieces కాలీఫ్లవర్
  • 1/3 cup పనీర్ ముక్కలు
  • 1/3 cup బటానీ
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • ఉప్పు
  • పసుపు – చిటికెడు
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1 tsp కసూరి మేథీ
  • 1/2 tsp గరం మసాలా
  • 3 tbsp బటర్
  • 3 tbsp ఫ్రెష్ క్రీమ్
  • 1 tsp నెయ్యి

విధానం

  1. గిన్నెలో గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీటి పాటు ఉప్పు కూడా వేసి మూత పెట్టి టొమాటో జీడిపప్పు మెత్తబడే దాకా ఉడికించుకోవాలి తరువాత వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి.
  2. పాన్లో నూనె వేడి చేసి దంచిన యాలకలు దుంప ముక్కలు, కేరట్ , బేబీ కార్న్, బీన్స్, కాలీఫ్లవర్ ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
  3. తరువాత బటర్ వేసి కూరలు లేత బంగారు రంగు వచ్చేదాకా మూతపెట్టి వేపుకుంటే చాలు
  4. బంగారు రంగు వచ్చాక అల్లం వెల్లులి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కసూరి మేథీ నలిపి వేసుకోవాలి
  5. టొమాటో పేస్ట్ పోసి బాగా కలిపి మూత పెట్టి నెయ్యి పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తరువాత బటానీ వేసి కలిపి వదిలేస్తే మెడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలకి నెయ్యి పైకి తేలుతుంది
  6. ఆఖరుగా పనీర్ ముక్కలు, క్రీమ్, నెయ్యి వేసి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోవాలి.