పెసరపప్పు పులుసు | పెసర కట్టు | రాచిప్పలో అమ్మలకాలం నాటి పెసరపప్పు పులుసు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup పెసరపప్పు
  • 1/2 cup సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు
  • 6 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 1/2 tsp పసుపు
  • 1/2 liter నీళ్ళు
  • 2.5 tbsp నిమ్మరసం
  • తాలింపు కోసం
  • 2 tsp నూనె/నెయ్యి
  • 2 ఎండు మిర్చి
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • ఇంగువా – చిటికెడు
  • కొత్తిమీర – చిన్న కట్ట

విధానం

  1. పెసరపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపి కడిగి 2.5 కప్పుల నీళ్ళతో మెత్తగా ఉడికించుకోవాలి.
  2. గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి , పసుపు, ఉప్పు, నీళ్ళు పోసి ఉల్లిపాయలు మెత్తగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి.
  3. ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పుని ఉల్లిపాయాల్లో పోసి కలుపుకోండి. పులుసుని 3-4 నిమిషాలు మరగనివ్వాలి (చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు ).
  4. మరిగిన పులుసులో నిమ్మరసం కలిపి స్టవ్ ఆపేయండి.
  5. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి వేపి పులుసులో కలిపేయండి, ఆఖరున కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి.
  6. అన్నం, ఇడ్లీ అట్టు తో చాలా రుచిగా ఉంటుంది ఈ సింపుల్ పెసరపప్పు పులుసు.