అడై కోసం ఉంచిన పప్పులన్నీ రాత్రంతా నానబెట్టుకోండి. తరువాతై రోజు పప్పులతో పాటు అడై కోసం ఉంచిన మిగిలిన పదార్ధాలన్నీ వేసి కొంచెం రవ్వగా పిండి గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న అడై పిండిలో కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా పిండి కలుపుకోండి.
పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోండి
పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండి పోసి కాస్త మందంగా పిండి అట్టు మాదిరి స్ప్రెడ్ చేసుకోండి.
కాలుతున్న అడై అంచుల వెంట నూనె వేసి కాల్చండి, అడై పైన కొంచెం పొడి గ్రైండ్ చేసుకున్న పొడి చల్లండి.
అడై ఒక వైపు ఎర్రగా కాలాక తిరగతిప్పి మరో 30 సెకన్లు మాత్రమే కాల్చి తీసుకోండి.
అడైలు వేడి వేడిగా కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.