మునక్కాడ స్వీట్ కార్న్ పాలు కూర | మునక్కాడ స్వీటీకార్న్ కర్రీ | మునక్కాడ కర్రి

Healthy Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కూరకి కావలసినవి:
  • 12-15 pieces మునక్కాడలు (2 అంగుళాలు ముక్కలు)
  • 1/3 cup స్వీట్ కార్న్
  • 1 cup నీరు
  • కొబ్బరి ముద్ద కోసం:
  • 1/4 cup పచ్చి కొబ్బరి
  • 5-6 పచ్చిమిర్చి
  • 10-12 వెల్లులి
  • తాలింపు కోసం:
  • 2 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 1 ఎండుమిర్చి
  • 1 sprig కరివేపాకు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు - కొద్దిగా
  • 1 cup కొబ్బరి పాలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. మునక్కాడ ముక్కలని నీరు పోసి మూతపెట్టి ఉడికించుకోండి. మునక్కాడ సగం ఉడికిన తరువాత స్వీట్ కార్న్ వేసి స్వీట్ కార్న్ ని మెత్తగా ఉడికించుకోండి.
  2. ఉడికిన మునక్కాడ స్వీట్ కారం ని వడకట్టి, వడకట్టిన నీటితో కొబ్బరి పాలు తీసుకోండి.
  3. మిక్సీలో బెత్తెడు పచ్చికొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వెల్లులి వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగప్పు, ఎండుమిర్చి కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేపుకోండి.
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిని మెత్తబడనిస్తే చాలు.
  6. ఆ తరువాత ఉడికించుకున్న మునక్కాడ స్వీట్ కార్న్ కొబ్బరి ముద్దా పసుపు వేసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోండి.
  7. మునక్కాడ ఉడికిన తరువాత మునక్కాడని ఉడికించుకున్న నీటితో తీసిన కొబ్బరి పాలు పోసి కలిపి మూతపెట్టి దగ్గరగా ఉడికించుకోండి.
  8. దింపబోయే ముందు ఉప్పు కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకోండి.