నీరు మరిగించి దింపి అందులో రాస్బెర్రీ జెల్లీ మిక్స్ సగం పేకెట్ వేసి కలిపి కరిగించండి. కరిగిన జెల్లీ మిశ్రమం లోతు తక్కుగ ఉన్న ప్లేట్లో పోసి గంట సేపు సెట్ అవ్వనివ్వండి.
నానిన సగ్గుబియ్యంని రెండింతల నీరు పోసి కలుపుకుంటూ ఉడికించి దింపి పక్కనుంచుకోండి.
పాలని మరిగించి అందులో ఉడికిన సగ్గుబియ్యం వేసి కలిపి మెత్తగా ఉడికించండి. సగ్గుబియ్యం ఉడికిన తరువాత కండేన్స్డ్ మిల్క్ ఎసెన్స్ వేసి కలిపి 3-4 నిమిషాలు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వండి.
సగ్గుబియ్యం మిశ్రమం చల్లారేలోగా తియ్యని కర్భూజాలో ముప్పావు భాగం జ్యూస్ గాను పావు భాగం ముక్కలుగా తరిగి పక్కనుంచుకోండి.
సెట్ అయిన జెల్లీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.
చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమంలో జెల్లీ ముక్కలు కర్భూజా జ్యూస్ ముక్కలు వేసి కలిపి ఫ్రిడ్జ్ లో 2-3 గంటలు వదిలేసి చల్లగా సర్వ్ చేయండి.