రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై | మటన్ వేపుడు

Curries | nonvegetarian

  • Prep Time 15 Mins
  • Cook Time 40 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kilo మటన్
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
  • 1 tbsp ధనియాల పొడి
  • 2 tbsp కారం
  • ఉప్పు
  • 3 tbsp నూనె
  • 1 tsp పసుపు
  • వేపుడుకోసం
  • 1/2 cup నూనె
  • 1 tsp అల్లం వెల్లులి పేస్టు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 4 ఎండు మిర్చి
  • 3 పచ్చిమిర్చి
  • 1 tsp గరం మసాలా
  • 2 tbsp కొత్తిమీర
  • 1 tbsp కరివేపాకు

విధానం

  1. మటన్ లో ఉంచుకున్న మసాలాలు అన్నీ కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచేయండి, కుదరనట్లైతే కనీసం 3 గంటలు ఫ్రిజ్లో నాననివ్వండి
  2. మరుసటి రోజు కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి అందులో 300 ml నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి, 3 గంటలు నానినట్లితే 6-7 విసిల్స్ రానివ్వండి
  3. మటన్ మెత్తగా ఉడికాక అడుగు మందంగా ఉన్న మూకుడు లో నూనె వేడి చేసి అందులో కరివేపాకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపుకోండి
  4. అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, మెత్తగా ఉడికిన్చుకున్న మటన్ నీళ్ళతో సహా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేం మీద కలుపుతూ హై- ఫ్లేమ్ మీద ముక్కలని వేగనివ్వండి
  5. ముక్కలు 15 నిమిషాలకి వేగి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలుతుంది, అప్పుడు మరో సారి బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కలు dryగా అయ్యేదాకా వేపుకోండి.
  6. దింపే ముందు కొత్తిమీర కరివేపాకు వేసి వేపి దిమ్పెసుకోండి
  7. నా దగ్గర నేను వేపి చేసుకున్న గరం మసాలా ఉంది కాబట్టి వేశాను. మీరు గరం మసాలా అప్పటికప్పుడు చేసినది వాడుకుంటే మసాలా ఘాటు మాంసానికి పట్టి చాలా రుచిగా ఉంటుంది.