మైసూర్ మసాలా దోశ | ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోని ఫాలో అవ్వండి
Breakfast Recipes
|
vegetarian
Prep Time40 Mins
Cook Time30 Mins
Resting Time720 Mins
Servings12
కావాల్సిన పదార్ధాలు
అట్టు పిండి కోసం
1/2
cup మినపప్పు
1
cup ఇడ్లీ బియ్యం
1
cup దోశల బియ్యం
1
tsp మెంతులు
2
tsp పచ్చి శెనగపప్పు
1/2
cup మందం అటుకులు
నీళ్ళు – పిండి రుబ్బుకోవడానికి
ఉప్పు రుచికి సరిపడా
నూనె అట్టు కాల్చడానికి
వెన్న/ బటర్ తగినంత
కారం కోసం
15
బయ్యడిగీ మిరపకాయలు (వేడి నీళ్ళలో నానబెట్టినవి)
2
tsp పచ్చి శెనగపప్పు
1/4
cup ఉల్లిపాయ తరుగు
1
tsp నువ్వులు
5 - 6
వెల్లులి
1/8
tsp పసుపు
ఉప్పు
1
tbsp నిమ్మరసం
2
tbsp నూనె
ఆలూ మసాలా కోసం
3
tbsp నూనె
1
tsp ఆవాలు
1
tbsp పచ్చిసెనగపప్పు
1
tsp జీలకర్ర
1
కరివేపాకు
1
cup ఉల్లిపాయ తరుగు
1.5
tsp అల్లం వెల్లులి ముద్ద
1/4
tsp పసుపు
ఉప్పు
4
ఉడికించిన బంగాళాదుంపలు
1/4
cup నీళ్ళు
1/4
cup కొత్తిమీర తరుగు
2
tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
విధానం
అట్ల పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ కడిగి కనీసం 5 గంటలు నానబెట్టి తరువాత గ్రైండర్లో అన్నీ వేసి తగినన్ని నీళ్ళు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. (ఒకసారి టిప్స్ చూడండి)
మెత్తగా రుబ్బిన పిండిని కనీసం 12 గంటలు పులవనివ్వాలి.
12 గంటల తరువాత తగినంత పిండి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు నీళ్ళు చేర్చి పలుచన చేసి పక్కనుంచుకోండి
కారం కోసం నూనె వేడి చేసి అందులో శెనగపప్పు వేసి ఎర్రగా వేపి తరువాత ఉల్లిపాయ తరుగు నువ్వులు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపి ఆఖరున వెల్లులి వేసి వేపి దింపేసుకోండి
మిక్సీజార్లో నానబెట్టిన బయ్యడిగీ మిరపకాయలు వేపుకున్న ఉల్లిపాయలు ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మిరపకాయలు నానబెట్టిన నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
ఆలూ కూర కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు, శెనగపప్పు, కరివేపాకు వేసి వేపుకోవాలి
తరువాత ఉల్లిపాయ తరుగు వేసి 2-3 నిమిషాలు వేపి అల్లం వెల్లులి ముద్దా, పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
తరువాత ఉడికించిన ఆలుగడ్డలని నలిపి వేసుకోండి. ఆలూ పైన కాసిని నీళ్ళు చిలకరించి నీరు దుంపలు పీల్చుకునే దాకా వేపి, ఆఖరున కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి దింపేసుకోండి
అట్టు వేసేముందు అట్ల పెనాన్ని నూనె వేసి ఉల్లిపాయతో బాగా రుద్ది మిగిలిన నూనెని తుడిచేయండి
తరువాత అట్టు పిండి పోసి పలుచుగా స్ప్రెడ్ చేసుకోండి.
పిండి పోసిన వెంటనే మధ్య కారం పేస్ట్ వేసి అట్టంతా పూయండి, అట్టు అంచుల వెంట నూనె వేయండి, మధ్యన వెన్న వేసి అట్టుని అట్ల కాడతో కదపకుండా ఎర్రగా కాలనివ్వాలి.
అట్టు ఎర్రగా కాలేదాక అట్లకాడతో అట్టుని తీయకండి, అట్టు ఎర్రగా కాలాక మధ్య ఆలూ కూర పెట్టి మధ్యకి మడిచి తీసుకోండి.