నాటుకోడి పులుసు

| nonvegetarian

  • Cook Time 60 Mins
  • Resting Time 180 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టానికి:
  • 1 kg నాటుకోడి
  • 1/2 tbsp పసుపు
  • 2 tbsp నూనె
  • ఉప్పు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • మసాలా పొడి కోసం:
  • 2 tbsp ధనియాలు
  • 7-8 లవంగాలు
  • 5 యాలకలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • 1/4 Cup ఎండుకొబ్బరి
  • 1 tbsp గసగసాలు
  • 1 బిర్యానీ ఆకు
  • కూర కోసం:
  • 6 tbsp నూనె
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 Sprigs కరివేపాకు
  • 1/2 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 750 ml వేడి నీళ్లు
  • 2 టమాటోల ముక్కలు
  • 2.5 tbsp కారం
  • 1 నిమ్మకాయ రసం
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)

విధానం

  1. కిలో నాటుకోడి ముక్కలకి ఉప్పు పసుపు అల్లం వెల్లులి ముద్దా నూనె పట్టించి కనీసం 3 గంటలైనా నానబెట్టండి
  2. మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి ఆఖరున గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపేసుకోండి.
  3. మసాలాలు పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోండి.
  4. నూనె వీడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద కొద్దిగా వేసి వేపుకోవాలి.
  6. తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తబడి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. ఆ తరువాత కారం కొద్దిగా నీళ్లు వేసి వేపితే కారాలు మాడవు.
  7. కారం వేగి టొమాటల్లోంచి నూనె పైకి తేలిన తరువాత మూడు గంటలు నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  8. చికెన్ వేగి నూనె పైకి తేలిన తరువాత వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాలి.
  9. సుమారుగా 35 నుండి 40 నిమిషాలు లేదా చికెన్ క్వాలిటీని బట్టి ఇంకొంచెం సమయం పట్టొచ్చు మొత్తానికి 80% ఉడికిన తరువాత నూరుకున్న మసాలాలు కొత్తిమీర వేసి కలిపి మూతబెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
  10. నూనె పైకి తేలిన తరువాత ఆఖరుగా ఒక నిమ్మకాయ రసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.