నెల్లూరు చేపల పులుసు | చేపల కూర | ఫిష్ పులుసు | ఫిష్ కర్రీ
|
nonvegetarian
Prep Time5 Mins
Cook Time45 Mins
Resting Time5 Mins
Servings4
కావాల్సిన పదార్ధాలు
పులుసు పొడి కోసం
2
pinches మెంతులు
½
tsp ఆవాలు
½
tsp జీలకర్ర
1
tbsp ధనియాలు
పులుసు కోసం
½
kg చేప ముక్కలు ఇంకా ఒక చేప తల ముక్కలు
1 ¾ -2
tbsp ఉప్పు
3 – 3 ½
tbsp కారం
½
litre చింతపండు (45 గ్రాములు చింతపండు నుండి తీసిన పులుసు)
1
జామకాయంత మామిడికాయ ముక్కలు
2
రెండు టొమాటోల పేస్ట్
½
tsp పసుపు
2
sprigs కరివేపాకు
3
slit పచ్చిమిర్చి
1
cup ఉల్లిపాయ
1/3
cup నూనె
కొత్తిమీర తరుగు (కొద్దిగా)
2
pinches ఇంగువ
½
tsp ఆవాలు
విధానం
చేప ముక్కలకి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి బాగా పట్టించి పక్కనుంచండి.
పులుసు పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేపి పొడి చేసి పక్కనుంచుకోండి.
నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి వేపుకోండి, ఆ తరువాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
వేగిన ఉల్లిలో మిగిలిన ఉప్పు కారం వేసి ఒక పొంగు రానివ్వండి.
పొంగిన ఉప్పు కారంలో టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మగ్గనివ్వండి.
నూనె పైకి తేలిన తరువాత మాత్రమే చింతపండు పులుసు పోసి అంచుల వెంట నూనె పైకి తేలేదాక మరగనివ్వండి.
పులుసు మరిగి నూనె పైకి తేలిన తరువాత నెమ్మదిగా చేప ముక్కలు ఒక్కోటిగా పులుసంతా వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని గిన్నె అంచుల పట్టి తిప్పితే పులుసులో ముక్కలు కుదురుకుంటాయ్.
చేప ముక్కుల్లోంచి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి, అస్సలు గరిట పెట్టి తిప్పకండి.
గిన్నె అంచులవెంట నూనె పైకి తేలాక నెమ్మదిగా మామిడికాయ ముక్కలు వేసి మరో సారి గిన్నె అంచులని పట్టి తిప్పితే మామిడి ముక్కలు పులుసులో మునిగిపోతాయ్. ఇప్పుడు మూతపెట్టి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి.
నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకున్న పులుసుని కనీసం 5-6 గంటలు లేదా రాత్రంతా ఊరనిచ్చి తింటే ముక్కకి ఉప్పు కారం పులుసు పట్టి చాలా రుచిగా ఉంటుంది.