రాగి అంబలి | అంబలి

Breakfast Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 720 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • రాగి పిండి ఉడికించుకోడానికి:
  • ½ cup రాగి పిండి
  • 1 cup నీరు
  • రాగి ముద్దలని నానబెట్టడానికి:
  • 1.5 litres నీరు
  • అంబలి కోసం:
  • 1.5 cups చిలికిన పెరుగు
  • 1 cup చల్లని నీరు
  • ⅓ cup ఉల్లి తరుగు
  • 1 పచ్చిమిర్చి
  • 1 tbsp అల్లం
  • 2 tbsp కొత్తిమీర
  • 1 sprig కరివేపాకు
  • ఉప్పు
  • 1 tsp వేపిన జీలకర్ర పొడి

విధానం

  1. రాగి పిండిలో నీరు పోసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  2. కలుపుకున్న రాగి పిండిని గడ్డలు లేకుండా జిగురులేని ముద్దగా అయ్యేదాకా ఓపికగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
  3. చల్లారిన రాగిని ముద్దలుగా చుట్టుకుని నీళ్లలో రాత్రంతా వదిలేయాలి.
  4. మరుసటి రోజు రాగి ముద్దని చేత్తో మెత్తగా ఉండలు లేకుండా మెదుపుకోవాలి, ఆ తరువాత జల్లెడలో వేసి వడకట్టుకుంటే మిగిలిన సన్నని గడ్డలు కూడా కరిగిపోతాయి.
  5. వడకట్టుకున్న రాగిలో చిలికిన పెరుగు నీరు సన్నని ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కొత్తిమీర తరుగు ఉప్పు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి.
  6. సంజీవనిలాంటి అంబలిని ఆస్వాదించండి.