బెండకాయ మజ్జిగ పులుసు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Total Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms బెండకాయ ముక్కలు
  • 1/2 ltr చిలికిన పెరుగు
  • కొబ్బరి పేస్టు కోసం
  • 2 tbsps పచ్చి సెనగపప్పు(గంట నానబెట్టినది)
  • 2 tsps బియ్యం(గంట నానబెట్టినది)
  • 1 tbsp ధనియాలు
  • 1/4 cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 1 tsp జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి ముక్కలు
  • మజ్జిగ పులుసు కోసం
  • 1/4 cup కొబ్బరి/రిఫైండ్ నూనె
  • 1 tsp ఆవాలు
  • 2 ఎండు మిర్చి
  • 1 tbsp అల్లం తరుగు
  • 1/2 tsp పసుపు
  • 2 రెబ్బల కరివేపాకు
  • 2 చిటికెళ్ళు ఇంగువా
  • రుచి సరిపడా రాళ్ళ ఉప్పు
  • 2 tbsps కొత్తిమీర తరుగు

విధానం

  1. మిక్సీ లో పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్ళతో పలుకులేని మెత్తని పేస్టు చేసుకోవాలి.
  2. మూకుడులో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. బెండకాయలు వేగాక తీసి పక్కనుంచుకోండి.
  3. అదే మూకుడులో ఇంకాస్త నూనె వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి.
  4. అందులోనే అల్లం, పసుపు వేసి కరివేపాకు వేసి వేపుకుని ఇంగువ కూడా వేసి వేపుకోవాలి.
  5. అల్లం వేగాక మెత్తగా రుబ్బుకున్న సెనగపప్పు కొబ్బరి పేస్టు వేసి కొంత పక్కనుంచుకోవాలి.
  6. సెనగపప్పు ముద్ద వేపి కాసిని నీళ్ళు పోసి ఉడుకుపట్టేదాక మీడియం ఫ్లేం మీద ఉడకనివ్వాలి.
  7. చిలికిన పెరుగులో సెనగపప్పుముద్ద వేసి బాగా కలిపి మూకుడులో పోసి ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి గడ్డలు లేకుండా కలుపుకుని సన్నని సెగ మీద ఓ ఉడుకు రానివ్వాలి.
  8. మజ్జిగ ఉడుకుపట్టాక వేపుకున్న బెండకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి దిమ్పెసుకోవాలి.