ఆనియన్ పరాటా

Breakfast Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 15 Mins
  • Resting Time 30 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • పరాటా పిండి కలుపుకోడానికి:
  • 1.5 cups గోధుమ పిండి
  • 2 చిటికెళ్ళు - వాము
  • ఉప్పు - కొద్దిగా
  • 1 tsp నూనె
  • నీళ్లు తగినన్ని
  • ఉల్లి మసాలా కోసం:
  • 1 cup ఉల్లి తరుగు
  • 1/2 tsp పచ్చిమిర్చి తురుము
  • 1/2 tsp అల్లం తురుము
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1/2 tsp నిమ్మరసం
  • 1/4 cup పల్చటి అటుకులు
  • పరాటాలు కాల్చుకోడానికి:
  • నూనె /నెయ్యి

విధానం

  1. గోధుమ పిండి వాము ఉప్పు నూనె వేసి ముందు కలుపుకోండి. పిండి కలిపిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పగుళ్లు లేని మెత్తని ముద్దగా వత్తుకోవాలి.
  2. వత్తుకున్న పిండిని సమానంగా ఉండలుగా చేసి తడిగుడ్డ కప్పి 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి.
  3. ఉల్లిపాయ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ కలిపి పక్కనుంచుకోండి.
  4. నానిన పిండి ముద్దని ముందు చేత్తో పలుచగా స్ప్రెడ్ చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని లోపల పెట్టి అంచులని ఒకదగ్గరకి చేర్చి గట్టిగా నొక్కండి.
  5. తరువాత పొడి పిండి చల్లి ముందు లోపలి మసాలాలని చేత్తో నెమ్మదిగా సమానంగా అన్ని వైపులకీ చేరేలా నొక్కండి.
  6. మసాలా అన్ని వైపులకీ చేరిన తరువాత పరాటా పగలకుండా నెమ్మదిగా గుండ్రంగా వత్తుకోండి.
  7. వత్తుకున్న పరాటాని కచ్చితంగా బాగా వేడి పెనం మీద వేసి పరాటాని ముందు కాస్త కాలనివ్వాలి. అంటే పరాటా అడుగు కాలి తెల్లబడాలి, అప్పుడు తిరగతిప్పి మరో వైపు కూడా హై ఫ్లేమ్ మీదే కాల్చాలి.
  8. రెండు వైపుల కాలిన తరువాత నూనె/నెయ్యి వేసి పరాటా పైన అక్కడక్కడ నల్ల మచ్చలు ఏర్పడే దాక కాల్చుకుని తీసుకోండి.