ఉల్లిపాయ పకోడీ | మెత్తటి ఉల్లిపాయ పకోడీ | ఆంధ్ర స్పెషల్ పకోడీ రెసిపి

Street Food | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 3 మీడియం ఉల్లిపాయలు
  • 3 పచ్చిమిర్చి
  • 2 sprigs కరివేపాకు
  • 1½ tbsp అల్లం తరుగు
  • ¼ tsp వంట సోడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర - కొద్దిగా
  • ½ tsp జీలకర్ర
  • 290 gms సెనగపిండి ((2 కప్పులు))
  • 2 ½ tbsp నెయ్యి
  • నీరు - ఇడ్లీ పిండంత జారుగా కలుపుకునేంత నీరు ఉండాలి

విధానం

  1. ఉల్లిపాయ ముక్కలుగా తరుక్కోండి. పచ్చిమిర్చి అల్లం సన్నని ముక్కలుగా తరుక్కోండి.
  2. తరిగిన ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి అల్లం సన్నని తరుగుతో పాటు మిగిపోయిన పదార్ధాలన్నీ కలపండి.
  3. ఉల్లిపాయల్ని బాగా పిండుతూ బాగా కలుపుకున్నాకా, నీరు వేసి బాగా వేగంగా 3-4 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి.
  4. పిండిని బాగా బీట్ చేసుకున్నాక మరిగే వేడి వేడి నూనెలో గోలీ సైజు అంత ఉండలుగా వేసుకోండి.
  5. పకోడీ వేశాక 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన పకోడీని తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా వేపుకుని తీసుకోండి.
  6. ఈ మెత్తని వేడి వేడిగా చాలా రుచిగా ఉంటాయి.