పాలకూర ఆకుల వరకు తుంచి నీళ్ళలో 3-4 నిమిషాలు ఉడికించి వెంటనే తీసి చన్నీళ్ళు పోయండి, దీని వల్ల పాలకూర రంగు మారదు.
చల్లారిన పాలకూర, పచ్చిమిర్చి. 1/4 కప్ నీళ్ళు వేసి మెత్తని పేస్టు చేయండి.
మూకుడు లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోండి.
ఆ తరువాత ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేపుని అల్లం వెల్లూలి పేస్టు వేసి వేపుకోవాలి.
పాలకూర పేస్టు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, నలిపిన కసూరి మేథీ వేసి బాగా కలిపి పాలకూర ఆకు మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద మూత పెట్టి ఉడికించండి.
ఆ తరువాత బటర్ వేసి కలపండి. బటర్ కరిగి పాలకూరలో కలిసిపోయి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
నూనె పైకి తేలకా 150 ml వేడి నీళ్ళు పోసి మూతపెట్టి చిక్కబడనివ్వండి.
ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టిన పనీర్ ముక్కలు వేసి ముక్కలు చిదరకుండా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి.
దింపే ముందు సువాసన కోసం 1 tsp నెయ్యి, నచ్చితే ఫ్రెష్ క్రీం వేసి కలిపి దిమ్పెసుకోండి రెస్టారంట్ టేస్ట్ వస్తుంది