పనీర్ బటర్ మసాలా

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Total Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms పనీర్
  • 5 టమాటో
  • 1 ఉల్లిపాయ
  • 1/4 cup జీడిపప్పు
  • 1 ఇంచ్దా ల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • 1/2 ఇంచ్ అల్లం
  • 4 వెల్లూలి
  • 1/2 tsp నలిపిన కసూరి మేథి
  • 3/4 tsp ధనియాల పొడి
  • 3/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp పంచదార
  • 4 tbsps బటర్
  • ఉప్పు
  • 2 tsps కాశ్మీరీ కారం
  • 1 tbsp నూనె
  • 1/2 cup ఫ్రెష్ క్రీం(పాల మీగడ)
  • 2 tsps కొత్తిమీర
  • 300 ml నీళ్ళు గ్రేవీ కోసం
  • 1/2 ltr టొమాటోలు ఉడికించడానికి

విధానం

  1. పాన్లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకలు, జీడిపప్పు ½ లీటర్ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  2. మెత్తగా ఉడికాక నీళ్ళతో సహా వెన్నలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
  3. పాన్ లో బటర్ కరిగించి అందులో, కాస్త నూనె, కష్మీరి కారం వేసి కాసేపు వేపి అందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్టు వేసి బాగా కలుపుతూ చిక్కబడనివ్వండి.
  4. గ్రేవీ చిక్కబడ్డాక కసూరీ మేథీ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి 300 ml నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
  5. మరుగుతున్న గ్రేవీ పైన నూరగతో తేట ఏర్పడుతుంది దాన్ని తీసేయండి. కూర ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
  6. గ్రేవీ కాస్త చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. ఆఖరున ఫ్రెష్ క్రీం(పాల మీగడ) వేసి కలుపుకోండి.
  8. దిమ్పేసే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లుకోండి.