పనీర్ ఫ్రైడ్ రైస్

Chinese Non-Veg Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 10 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm పనీర్
  • 2 చిటికెళ్లు కారం
  • 1 tsp టమాటో సాస్
  • 2 tsp నూనె
  • ఫ్రైడ్ రైస్ కోసం
  • 1 cup పొడిపొడిగా వండుకున్న బాస్మతి రైస్ (150 gm)
  • 2 tsp నూనె
  • ఉప్పు
  • 1/2 tsp ఆరొమేట్ పౌడర్
  • 1/2 tsp వైట్ పెప్పర్
  • 1/2 tsp నల్ల మిరియాల పొడి
  • 1/4 cup కేరట సన్నని తరుగు
  • 1/4 cup బీన్స్ సన్నని తరుగు
  • 1 tsp లైట్ సోయా సాస్
  • 2 tbsp ఉల్లి కడల తరుగు

విధానం

  1. నూనెలో పనీర్ కారం టొమాటో సాస్ వేసి 2 నిమిషాలు టాస్ చేసి పనీర్ పక్కనుంచుకోండి
  2. నూనె వేడి చేసి అందులో కేరట్ బీన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం టాస్ చేసుకోవాలి
  3. నిమిషం తరువాత రైస్తో పాటు మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి ఒక నిమిషం టాస్ చేసుకోవాలి
  4. ఆఖరున ఉల్లికాడల తరుగు వేసి కలిపి దింపేసుకోండి