కోఫ్తా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోండి.
కలుపుకున్న పనీర్లో ఆఖరున మైదా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి పగుళ్లు లేని ఉండలు చుట్టుకోండి
కోఫ్తాలని వేడి నూనెలో వేసి కోఫ్తా పగలకుండా ఎర్రగా వేపుకుని తీసుకోండి
కోఫ్తా కర్రీ కోసం నెయ్యి నూనె కరిగించి యాలకలు లవంగాలు షాహీ జీరా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అనాసా పువ్వు ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి
ఉల్లిపాయ ఎర్రబడ్డాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి. వేగిన ఉల్లిపాయాల్లో టొమాటో ముక్కలు వేసి గుజ్జుగా అయ్యేదాక వేపుకోవాలి
టొమాటో గుజ్జుగా అవుతుండగా కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
నూనె పైకి వచ్చకా జీడిపప్పు ముద్ద కొద్దిగా నీళ్ళు వేసి బాగా వేపుకోవాలి.
స్టవ్ ఆపేసి పెరుగు తగినన్ని నీళ్ళు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చీ ముక్కలు వేసి బాగా కలిపి ఒక పొంగు రానివ్వాలి.
ఉడుకుతున్న గ్రేవీలో వేపుకున్న కోఫ్తాలు వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. నిమిషం తరువాత సగం కోఫ్తాలు సగం గ్రేవీ తీసి పక్కనుంచుకోండి. మిగిలినది బిర్యానీ చేసే గిన్నెలోనే ఉంచండి.
80% ఉడికిన బాస్మతి బియ్యం సగాన్ని వడకట్టి కోఫ్తా పైన వేసకోవాలి పక్కనుంచుకున్న కోఫ్తా గ్రేవీ కోఫ్తాలు మొత్తం రైస్ పైన పోసి మిగిలిన రైస్ కోఫ్తాల పైన వేసి సర్దుకోవాలి.
రైస్ పైన జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు, నెయ్యి అన్నం ఉడికిన నీళ్ళు పోసి సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసి మూత పెట్టి సీల్ చేసి 12 నిమిషాలు సిమ్లో ధం చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి
20 నిమిషాల తరువాత పైన ½ tsp కుంకుమపువ్వు నీళ్ళు పోసి అడుగునుండి అట్లకాడతో తీసి మిర్చీ కా సాలాన్తో సర్వ్ చేసుకోండి.