2
cup గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం (1 cup 185 gm)
3
cups నీళ్లు
2
పచ్చిమిర్చి ముక్కలు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
విధానం
ఉల్లిపాయ ఊరబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి గంట సేపు ఊరబెట్టాలి.
నెయ్యి కరిగించి అందులో డ్రై మసాలాలు అన్నీ వేసుకోండి.
అందులోనే పనీర్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన తరువాత తీసుకోవాలి.
మిగిలిన నెయ్యిలో ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్దా వేసి వేపి పసుపు ఉప్పు జీలకర్ర పొడి కొద్దిగా నీళ్ళు వేసి వేపుకోవాలి.
వేగిన మసాలాలో టమాటో ముక్కలు బటాణీ వేసి 3 నిమిషాలు వేపండి. .తరువాత నానబెట్టిన బియ్యం వేసి చెమ్మగారే దాకా వేపుకోవాలి.
బియ్యంలో చెమ్మారిన తరువాత ఎసరు నీళ్లు పోసి కలిపి పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర తరుగు వేపిన పనీర్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి 2 విజిల్స్ హై - ఫ్లేమ్ మీద రానివ్వాలి. తరువాత సెటప్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.
20 నిమిషాల తరువాత నిమ్మరసంలో ఊరిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వడకట్టి పులావ్ పైన వేసి అడుగునుండి కలిపి చల్లని రైతాతో సర్వ్ చేసుకోండి.